Google

Wednesday, November 2, 2011


చిత్రం: శ్రీరామ రాజ్యం.
గానం: బాలసుబ్రమణ్యం, శ్రేయ ఘోషల్.
సంగీతం: ఇళయరాజా


(పల్లవి)
అ: జగదానందకారక జయ జానకీ ప్రాణ నాయకా...
ఆ: ఆ....జగదానందకారక జయ జానకీ ప్రాణ నాయకా.....శుభ స్వాగతం..ప్రియ పరిపాలకా...

(అ & ఆ) "జగదానందకారక"

(అనుపల్లవి)
(అ:) మంగళకరమౌ నీ రాక, ధర్మానికి వేదిక అవుగాక..
మా జీవనమే ఇక పావనమౌ గాక
(ఆ:) నీ.. పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
{కో} "జగదానందకారక"
(చరణం1:)
సార్వభౌమునిగ పూర్ణకుంభముల స్వాగతాలు పలికే..
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే..

(కో) {
(అ:) నాల్గు వేదములు తన్మయత్వమున జలది మారుమ్రోగే..
(ఆ:) న్యాయ దేవతే శంఖమూదగా పూల వాన కురిసే..
}

(అ:) రాజమకుటమే ఒసగెలే..నవరత్న కాంతి నీరాజనం
(ఆ:) సూర్యవంశ సింహాసనం పులకించి చేసె అభివందనం
(అ:) సామ్రాజ్య లక్ష్మి యే పాద స్పర్శకే పరవశించి పోయే..
{కో} (అ:) "జగదానందకారక"
{కో} (ఆ:) "జగదానందకారక"

(చరణం2:)
(అ:) రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే
రామ శాసనము తిరుగులేనిదని జలదిబోధ చేసే

(కో) {
(ఆ:) రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే
(అ:) రామ రాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే
}

(ఆ:) రామ మంత్రమే తారకం, బహు శక్తి ముక్తి సందాయకం
(అ:) రామ నామమే అమృతం, శ్రీరామ కీర్తనం సుకృతం
(ఆ:) ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే

(అ:) "జగదానందనాయకా"
(ఆ:) "జగదానందనాయకా"

(అ & ఆ) "మంగళకరమౌ"

Monday, April 21, 2008

చిత్రం : హృదయాంజలి
గానం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్.

ప:మానస వీణ మౌన స్వరాన ఝుమ్మనిపాడే తొలిభూపాలం
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలిభూపాలం
పచ్చదనాల పానుపుపైన అమ్మైనీలా జోకొడుతుంటే
పచ్చదనాల పానుపుపైన అమ్మైనీలా జోకొడుతుంటే
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం

అఆ.... అఆ... ....

చ: పున్నమినదిలో విహరించాలి పువ్వులఒళ్లో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి తొలకరిజల్లై దిగిరావాలి
తారలపొదరింట రాతిరిమజిలీ వేకువవెనువెంట నేలకుతరలి
కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి

మానసవీణ మౌనస్వరాన ఝుమ్మనిపాడే తొలిభూపాలం


"వాగునా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం
వాగునా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం "

చ: ఊహకునీవే ఊపిరిపోసి చూపవే దారి ఓ చిరుగాలి
కలలకుసైతం సంకెలవేసే కలిమిఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి దోసెడుఊసులు తీసుకువెళ్లి
పేదగరికపూలకు ఇస్తా నా హృదయాంజలి || మానస ||


|| వాగునా ||



Monday, June 25, 2007

Tuesday, June 19, 2007