Google

Wednesday, November 2, 2011


చిత్రం: శ్రీరామ రాజ్యం.
గానం: బాలసుబ్రమణ్యం, శ్రేయ ఘోషల్.
సంగీతం: ఇళయరాజా


(పల్లవి)
అ: జగదానందకారక జయ జానకీ ప్రాణ నాయకా...
ఆ: ఆ....జగదానందకారక జయ జానకీ ప్రాణ నాయకా.....శుభ స్వాగతం..ప్రియ పరిపాలకా...

(అ & ఆ) "జగదానందకారక"

(అనుపల్లవి)
(అ:) మంగళకరమౌ నీ రాక, ధర్మానికి వేదిక అవుగాక..
మా జీవనమే ఇక పావనమౌ గాక
(ఆ:) నీ.. పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
{కో} "జగదానందకారక"
(చరణం1:)
సార్వభౌమునిగ పూర్ణకుంభముల స్వాగతాలు పలికే..
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే..

(కో) {
(అ:) నాల్గు వేదములు తన్మయత్వమున జలది మారుమ్రోగే..
(ఆ:) న్యాయ దేవతే శంఖమూదగా పూల వాన కురిసే..
}

(అ:) రాజమకుటమే ఒసగెలే..నవరత్న కాంతి నీరాజనం
(ఆ:) సూర్యవంశ సింహాసనం పులకించి చేసె అభివందనం
(అ:) సామ్రాజ్య లక్ష్మి యే పాద స్పర్శకే పరవశించి పోయే..
{కో} (అ:) "జగదానందకారక"
{కో} (ఆ:) "జగదానందకారక"

(చరణం2:)
(అ:) రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే
రామ శాసనము తిరుగులేనిదని జలదిబోధ చేసే

(కో) {
(ఆ:) రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే
(అ:) రామ రాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే
}

(ఆ:) రామ మంత్రమే తారకం, బహు శక్తి ముక్తి సందాయకం
(అ:) రామ నామమే అమృతం, శ్రీరామ కీర్తనం సుకృతం
(ఆ:) ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే

(అ:) "జగదానందనాయకా"
(ఆ:) "జగదానందనాయకా"

(అ & ఆ) "మంగళకరమౌ"